మహేష్ స్పైడర్ టోటల్ కలెక్షన్స్…టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్

0
1762

      టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీస్ లో శ్రీమంతుడు పక్కన పెడితే మిగిలిన సినిమాల్లో ఎక్కువగా అంచనాలను అందుకున్నవి తక్కువే…. 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం సినిమాలు మహేష్ కెరీర్ లో ఒకటిని మించిన ఫ్లాఫ్స్ గా ఒక్కోటి మిగలగా అందులో నటుడిగా మహేష్ అన్ని సినిమాల్లోనూ ఫుల్ మార్కులు కొట్టేయడమే కాదు ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు కూడా కొన్ని ఉండేలా చూసుకున్నాడు. కానీ మొదటిసారి స్పైడర్ సినిమాతో అంచనాలు భారీగా తప్పేశాడు.

తుపాకి, కత్తి లాంటి పీక్స్ లో హీరోయిజంని ఎలివేట్ చేసే సినిమాలు చేసిన మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ చేస్తున్నాడు అంటే…అంచనాలు పీక్స్ లో పెరిగిపోవడం ఖాయం… కానీ సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలను ఏమాత్రం అందుకోలేదు..కథ బాగున్నా అది సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గ కథ కాదని ఏమాత్రం హీరోయిజం లేని కథని మహేష్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ….

అందరూ విమర్శించగా సినిమాకి అది నెగటివ్ గా మారి మొదటి ఆట నుండే అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. తమిళ్ లో మురగదాస్ క్రేజ్ వల్ల మహేష్ తొలిసారి పరిచయం అవుతుండటం వలన పర్వాలేదు అనిపించే వసూళ్ళ ని అక్కడ సినిమా సాధించింది. మొత్తం మీద కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

నైజాం—9.95 కోట్లు
సీడెడ్—4.76 కోట్లు
వైజాగ్—4.01 కోట్లు
ఈస్ట్—-3.9 కోట్లు
వెస్ట్—-2.92 కోట్లు
కృష్ణా—2.74 కోట్లు
గుంటూరు—3.69 కోట్లు
నెల్లూరు—1.89 కోట్లు
మొత్తం రెండు రాష్ట్రాల కలెక్షన్స్—-33.86 కోట్లు
కర్ణాటక—6.6 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—2.6 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-8.7 కోట్లు
తమిళ్ వర్షన్—-11.2 కోట్లు 
మలయాళ వర్షన్—-1.09 కోట్లు 
మొత్తం కలెక్షన్స్—-30.19 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్——64.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్—–110 కోట్లు

సినిమాకి టోటల్ గా పెట్టిన బడ్జెట్ 120 కోట్లవరకు ఉండగా సినిమా మొత్తంగా 124.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా టోటల్ రన్ లో 64.05 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం మీద 60.55 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ మూవీ గా స్పైడర్ సినిమా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here