బాహుబలి ఫస్ట్-స్పైడర్ సెకెండ్…టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది

0
3032

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి రెండు రాష్ట్రాలు కాకుండా సౌత్ మొత్తం తెలుగు సినిమా మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేయాలని ఎప్పటి నుండో కోరిక…బిజినెస్ మాన్ మూవీ ని తెలుగు తమిళ్ మరియు మలయాళం లో ఓకే సమయం లో ఆడియో రిలీజ్ చేసినా సినిమాను మాత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత బాహుబలి వచ్చి  అన్ని ఎరియాల్ల్లో మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.

తమిళ్ లో ఆ సినిమా సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదనే చెప్పాలి. అలాంటి చోట డైరెక్ట్ తమిళ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలి అని ఫిక్స్ అయిన మహేష్ ఏ.ఆర్.మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ తో చేసిన స్పైడర్ అక్కడ మొత్తం మీద 18.5 కోట్ల బిజినెస్ చేయగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ముగించింది.

మొత్తం మీద తమిళనాడు లో 11.1 కోట్ల షేర్ ని వసూల్ చేసిన స్పైడర్ డైరెక్ట్ తమిళ్ లో అడుగుపెట్టిన తెలుగు సినిమాల్లో నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసినా సినిమా బిజినెస్ కి చాలా దూరం లో ఉంది…భారీ మార్కెట్ ఎక్స్ పాన్షన్ ని స్పైడర్ వాడుకుంటుంది అనుకున్న టాలీవుడ్ కి స్పైడర్ షాక్ ఇచ్చింది. మరి సినిమా అక్కడ ఎంత దూరం వెళుతుందా అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here