స్పైడర్ ఓవర్సీస్ రిపోర్ట్…..దిమ్మతిరిగే షాక్ ఇది

0
3044

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ మొదటి నుండి ఓవర్సీస్ లో తన మార్కెట్ ని ఓ రేంజ్ లో ఎక్స్ పాండ్ చేసుకున్న మహేష్ వరుసగా 6 సార్లు 1 మిలియన్ మార్క్ అందుకున్న ఓకే ఒక్క టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. కానీ శ్రీమంతుడు తర్వాత నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు మహేష్.

బ్రహ్మోత్సవం ఆల్ టైం డిసాస్టర్ గా నిలవగా ఇప్పుడు అత్యంత భారీ అంచనాలతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం లేదు. మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 64 కోట్ల షేర్ ని అందుకున్న స్పైడర్ ఓవర్సీస్ లో కూడా షాకింగ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.

సింపుల్ గా బ్రేక్ ఈవెన్ కి 4.5 మిలియన్ డాలర్స్ తెలుగు మరియు తమిళ్ వర్షన్స్ కలిపి సాధించాల్సిన స్పైడర్ గా మొదటి రోజే ప్రీమియర్స్ తో 1 మిలియన్ ని అందుకుంది. కానీ తర్వాత సినిమా కలెక్షన్స్ 80% పడిపోయి అందరికీ షాక్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం 1.55 మిలియన్ వరకే కలెక్ట్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏమాత్రం పుంజుకోలేక టాలీవుడ్ చరిత్రలో ఓవర్సీస్ లో కూడా దిమ్మతిరిగే ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here