మహేష్ స్పైడర్ ట్రైలర్ రివ్యూ…కామన్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే??

0
1653

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం లాంటి డిసాస్టర్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఏమాత్రం తన అప్ కమింగ్ మూవీ స్పైడర్ పై పడకుండా చూసుకున్నాడు. భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ్ లో ఏక కాలం లో రూపొందిన స్పైడర్ మూవీ ఈ నెల 27 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఈ రోజు సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయాలి అని భావించారు.

కానీ అనుకోకుండా ట్రైలర్ నిన్న రాత్రి లీక్ అవ్వడంతో ఉన్న పళంగా అర్ధరాత్రి 12 గంటలకు స్పైడర్ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా ట్రైలర్ కి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఎస్.జే సూర్య విలనిజం….ఎ.ఆర్.మురగదాస్ టిపికల్ డైరెక్షన్…సూపర్ స్టార్ మేస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్ కి హైలెట్ అవ్వగా…

హారిజ్ జయరాజ్ అందించిన సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. అన్ని వర్గాలాను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ట్రైలర్ కి కామన్ ఆడియన్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం…ఇక ట్రైలర్ లో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్…

ట్రైలర్ మొత్తం హాలివుడ్ బ్యాట్ మాన్ బిగిన్స్ ని పోలి ఉండటం అని అంటున్నారు…సినిమా కాన్సెప్ట్ కూడా బ్యాట్ మాన్ బిగిన్స్ ని పోలి ఉంటుందని ఇన్ సైడ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది…ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది…ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత మేము ఇస్తున్న రేటింగ్ 3.5 స్టార్స్…మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here