మళ్ళీరావా మూవీ రివ్యూ…రేటింగ్…ఆడియన్స్ టాక్!!

0
1239

        హీరో గా ఒక్క హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది హీరో సుమంత్ కి….కెరీర్ తొలినాళ్ళలో కొన్ని మంచి సినిమాలు చేసినా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీ కథ లను సరిగ్గా జడ్జ్ చేయలేక పోయినా సుమంత్ ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుని ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ స్టేజ్ కి వచ్చేసినా మళ్ళీ ఎదో ఒక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు.

ఇప్పుడు మళ్ళీరావా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ కి ఈ సారి ఎలాంటి రిజల్ట్ దక్కిందో తెలుసుకుందామ్ పదండీ…..మనసంతా నువ్వే టైప్ లో చిన్నప్పుడే విడిపోయిన ప్రేమ జంట…తిరిగి 13 ఏళ్ల తర్వాత ఎలా ఏకం అయ్యారు అనేది చాల సింపుల్ గా సినిమా కథ…

కానీ మనసంతా నువ్వే లా ఇందులో మిగిలిన కమర్షియల్ హంగులు ఉండవు…ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ని అదే ఫీలింగ్ తో చూడటం ఇష్టపడే వారికి మళ్ళీరావా మంచి సినిమాగా అనిపించడం ఖాయం…కానీ అదే సమయం లో ఇప్పుడున్న రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్లకి ఈ సినిమా బోర్ కొట్టడం కూడా ఖాయం.

మళ్ళీరావాఅన్ని వర్గాలకు చేరువ అయ్యే సినిమా కాదు…..కవిత్వం, కళ, సంగీతం ఇప్పుడున్న ప్రేక్షకులలో ఎక్కువమందికి పెద్దగా ఎక్కడం కష్టం….సినిమా కూడా అంతే….ఫీల్ గుడ్ సీన్స్ తో సినిమా మొత్తం ప్రతీ ఫ్రేమ్ ఎంతో ఫీల్ ని కలిగించేలా సినిమా ఉంటుంది.

సుమంత్ తో పాటు హీరోయిన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు…మిగిలినవాళ్ళు అందరూ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశారు…డైరెక్టర్ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ఎలా ఉంటుందో అలానే తీశాడు. సెకెండ్ ఆఫ్ ఎండింగ్ సడెన్ గా ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

ఇది మరియు సినిమా చాలా స్లో గా ఉండటం మైనస్ పాయింట్స్…ఇవన్నీ పక్కకు పెడితే కమర్షియల్ సినిమాలు కోరుకునే వారు మళ్ళీరావా కి దూరంగా ఉండటం బెటర్…ట్రై చెద్దాం అని ఫిక్స్ అయితే స్లో స్క్రీన్ ప్లే ని బరిస్తే మంచి ఫీల్ ఉన్న మూవీ అన్న భావన కలుగుతుంది…

ఇలాంటి ఫీల్ ఉన్న మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం మళ్ళీరావా మంచి సినిమాగా అనిపిస్తుంది…ఇక కమర్షియల్ సక్సెస్ అనేది ఆ వర్గం ప్రేక్షకులు ఎంత ఎక్కువ చూస్తె సినిమాకి అంత బెటర్ అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…మీరు సినిమా చూస్తె ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here