చస్…2 వ రోజు కన్నా 5 వ రోజు కలెక్షన్స్ ఎక్కువ…భీభత్సం ఇది

0
2158

వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వీకెండ్ ని ముగించింది…రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో కుమ్మేయడం విశేషం అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా నైజాంలో సినిమా ను ఆపడం ఎవ్వరి తరం కావడం లేదు….సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా 5 రోజులు ముగిసే సరికి 9 కోట్ల షేర్ ని నైజాంలో సాధించింది.

ఇక్కడ విశేషం ఏంటి అంటే మొదటి రెండు రోజుల తర్వాత మూడో రోజు నుండి కలెక్షన్స్ తగ్గుతాయి. రెండో రోజు సినిమా నైజాంలో 1.38 కోట్ల షేర్ ని అందుకోగా 5 వ రోజు కలెక్షన్స్ కలెక్షన్స్ రెండో రోజు కన్నా ఎక్కువ ఉండటం అందరికీ షాక్ ని కలిగించింది అని చెప్పొచ్చు.

MCA 5 వ రోజు నైజాం ఏరియాలో 1.46 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే వసూళ్లు సాధించిన ఈ సినిమా బిజినెస్ లో చాలా వరకు వెనక్కు తీసుకు వచ్చింది…మరి 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు తరువాత ఆర్టికల్ లో పబ్లిష్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here