మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్…ఈ నెల 20 న….??

0
3767

  టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి…వీళ్ళ కాంబినేషన్ లో మూవీ పడితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని అనుకోవడం కామనే…కానీ ఆ కాంబినేషన్స్ అనుకున్నంత ఈజీగా సెట్ అవ్వడం కష్టమే…కానీ సెట్ అయితే ఆ కాంబినేషన్ లో వచ్చే సినిమా కి ఉండే ఊపే వేరు గా ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి కాంబినేషనే ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ లో మొదలు కావడానికి ముహూర్తం సిద్ధం అయ్యింది.

ఆ కాంబినేషన్ మరేదో కాదు…మగధీర తో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో గా పేరు తెచ్చుకున్న రామ్ తర్వాత అలాంటి మాస్ మూవీ చేయలేదు… కాగా ఇప్పుడు టాలీవుడ్ లోనే ఊరమాస్ డైరెక్టర్స్ లో తనకంటూ అల్టిమేట్ క్రేజ్ ని దక్కించుకున్న బోయపాటి శ్రీను తో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు.

మొదట్లో ఇది రూమర్ అనుకున్నా ఇప్పుడు సినిమా అఫీషియల్ గా ఈ నెల 20 న పూజా కార్యక్రామాలతో మొదలు కానుందని సమాచారం… రంగస్థలం షూట్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నాడట చరణ్…ఈ సినిమా 2018 మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలవడం ఖాయం…దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here