మెగాస్టార్ చిరంజీవి “మీలో ఎవరు కోటీశ్వరుడు” ఫ్లాఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే !!

0
3450

వెండితెరపై దాదాపు 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసినా తనదైన స్టైల్ లో కలెక్షన్ల వర్షం కురిపించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఏకంగా 102 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సత్తా చాటుకున్నాడు ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి. కానీ బుల్లితెరపై తను చేసిన తొలి షో ద్వారానే ఘోరంగా ఫ్లాఫ్ అయ్యాడు.

ఇది విశ్లేషకులు….మీలో ఎవరు కోటీశ్వరుడు షో టి.ఆర్.పి చూసినవాళ్ళు చెబుతున్న మాట. అసలు తొలి MEK సీజన్ తర్వాత నుండే రేటింగ్ పడిపోతుండటంతో ఎలాగోలా మూడు సీజన్స్ కంప్లీట్ చేసి ఈసారి కొత్తతనం కోసం మెగాస్టార్ ని తీసుకున్నారు కానీ ఇప్పుడు అదీ ఫలించడం లేదు.

ఈ ఫ్లాఫ్ షోకి ప్రదాన కారణం ఫిబ్రవరి లాంటి ఎగ్జాం సీజన్ లో షో ని టెలికాస్ట్ చేయడమే అంటున్నారు…అసలు లెక్కకు ఈ సీజన్ని ని డిసెంబర్ లోనే టెలికాస్ట్ చేయాలి అనుకున్నా మెగాస్టార్ ని వెండితెరపైనే కంబ్యాక్ చూడాలని ఆపారట. కానీ ఇప్పుడు పరీక్షల సమయంలో పేరెంట్స్ అందరూ పిల్లలను చదివించే పనిలోనే నిమగ్నం  అవ్వగా షోని చూసే సమయం లేదు అంటున్నారు. 

దానికి తోడూ మెగాస్టార్ నాగార్జున నటించినంత నాచురల్ గా నటించడంలో విఫలం అవుతున్నాడన్న అపవాదు కూడా ఉంది…ఇలా ఒక్కో కారణం కలుస్తూ మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫ్లాఫ్ కి కారణం అయ్యాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here