మెంటల్ మదిలో మూవీ రివ్యూ…సూపర్బ్ మూవీ !!

0
1344

       చిన్న సినిమాలతో తన మార్క్ ని చూపిస్తూ వచ్చిన శ్రీ విష్ణు ఫుల్ లెంత్ హీరో గా చేసిన లేటెస్ట్ మూవీ మెంటల్ మదిలో…పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలి ఆటకి థియేటర్ లో జనాలు ఏమాత్రం లేరు కానీ సినిమా చూసిన తర్వాత ఆ జనాల ఫీలింగ్ మాత్రం అద్బుతం అనే చెప్పాలి.

కథ చాలా సింపుల్ పాయింట్….కొందరికి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది…2 చాయిస్ లు ఉంటె అందులో ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు…ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్…చాలా సింపుల్ కథ అయినా దర్శకుడు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

ఈ మధ్యకాలంలో తెలుగు లో ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమాలు కొన్ని ఎంతబాగా ఆకట్టుకున్నాయో తెలిసిందే..ఈ సినిమా కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే అని చెప్పాలి… కథ మొదలు అవ్వడం స్లో గా మొదలు అయినా తర్వాత ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయిపోయిందో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

క్లాస్ స్టొరీ అవ్వడం తో మాస్ మూవీస్ ఇష్టపడే వారికి కొంత కష్టంగా ఉన్నా సినిమా లో ఉన్న స్వీట్ నెస్ ని ఎంజాయ్ చేస్తే మాత్రం కొంతకాలం గుర్తుండిపోయే సినిమా ఇది అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు.

హీరో శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు… హీరోయిన్స్ ఇద్దరు అద్బుతంగా నటించగా స్వేచ్చ పాత్ర చేసిన హీరోయిన్ సినిమా అయిపోయినా పాత్ర మనతో ట్రావెల్ చేసేలా ఉండటం విశేషం. ఇక మిగిలిన పాత్రలు అన్నీ తమ పాత్రలకు న్యాయం చేశాయి.

సంగీత దర్శకుడు ప్రశాత్ ఆర్ విహారి సినిమాకి తగ్గ ఫీల్ గుడ్ మ్యూజిక్ ని అందించాడు…ఇక ఫైనల్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ చిన్న పాయింట్ ని ఎంతో అందంగా తెరకెక్కించి మొదటి సినిమాతోనే ఆకట్టుకుని మంచి డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు అని చెప్పొచ్చు.

మొత్తం మీద సినిమా పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ థియేటర్స్ నుండి తిరిగి వచ్చే సమయం లో మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం. ఈ వీకెండ్ ఉన్న సినిమాలలో ది బెస్ట్ మూవీ ఇదే అని చెప్పాలి. సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3.25/5 స్టార్స్….మీరు చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here