ఇదేమి సినిమా సామి…కలెక్షన్స్ చూసి సౌత్ మొత్తం షాక్

0
10353

  కోలివుడ్ తలైవా ఇలయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు నమోదు చేసి సంచలనం సృష్టిస్తుంది. సినిమా కి మొదటి రోజు నుండి ఎబో యావరేజ్ టాక్ లభించినా కలెక్షన్స్ మాత్రం ఊరమాస్ లెవల్ లో కొనసాగుతున్నాయి. మొదటి రోజు నుండి కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దూసుకు పోతున్న మెర్సల్ 20 రోజుల్లో సంచలన కలెక్షన్స్ ని సాధించి 220 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

తమిళనాడు లో 120 కోట్లు, కేరళ లో 18 కోట్లు, కర్ణాటక లో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా మొత్తంగా ఇండియా లో 158 కోట్ల గ్రాస్ ని అందుకుంది. యుఎస్/కెనడాలో 12 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల కలిపి మరో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచనలం సృష్టించింది.

మొత్తం మీద ఇండియా అవతల 62 కోట్ల గ్రాస్ ని 20 రోజుల్లో అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 126 కోట్ల షేర్ ని 20 రోజుల్లో అందుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమా బ్రేక్ ఈవెన్ కి ని మించి 20 కోట్ల వరకు గ్రాస్ ఎక్కువగానే అందుకుందని చెప్పొచ్చు….. త్వరలోనే 250 మార్క్ ని అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here