ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక Dis Likes తెచ్చుకున్న తలైవా సినిమా…సౌత్ మొత్తం షాక్

0
1689

  అందరికీ గుర్తుండే ఉంటుంది…ఈ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ సమయంలో కొన్ని పరిస్థితుల నడుమ పవన్ ఫ్యాన్స్ అల్లుఅర్జున్ కి యాంటీగా మారి దువ్వాడ జగన్నాథం టీసర్ కి డిస్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. దానికి అల్లుఅర్జున్ అంటే నచ్చని వాళ్ళు కూడా తోడు అవ్వడంతో టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఏకంగా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక డిస్ లైక్స్ తెచ్చుకున్న టీసర్ గా మారింది.

కాగా ఇప్పుడు ఆ రికార్డును అల్లుఅర్జున్ నుండి మరో హీరో తీసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు కోలివుడ్ తలైవా ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ మూవీ దక్కించుకుని కోలివుడ్ కే కాకుండా సౌత్ కే కాకుండా టోటల్ ఇండియాకే షాక్ ఇచ్చింది.

25 మిలియన్ వ్యూస్ కి దగ్గర అవుతున్న మెర్సల్ టీసర్ ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా లైక్స్ ని దక్కించుకోగా ఇప్పటి వరకు 2 లక్షల 6 వేలకు పైగా డిస్ లైక్స్ తో షాక్ ఇచ్చింది. దాంతో దువ్వాడ జగన్నాథం డిస్ లైక్స్ రికార్డును విజయ్ మెర్సల్ సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here