నా నువ్వే Vs సమ్మోహనం ఫైనల్ విన్నర్ ఎవరు??

0
1427

బాక్స్ ఆఫీస్ దగ్గర పోయిన వీకెండ్ రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు లవ్ స్టొరీ లే అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వస్తే రెండు సినిమాలు బాగా కుమ్మేస్తాయి అని అంతా భావించారు, కానీ రిలీజ్ అయిన రెండు సినిమాలలో ఒక సినిమా మొదటి రోజుకే చల్లబడగా మరో సినిమా మాత్రం ప్రేక్షకుల మనస్సు గెలుచుకుని బాక్స్ ఆఫీస్ దగగ్ర మంచి వసూళ్ళని సాధిస్తుంది.

ఆ రెండు సినిమాలే నా నువ్వే మరియు సమ్మోహనం, కళ్యాణ్ రామ్ కెరీర్ లో తొలి లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే తేడా కొడుతూ వచ్చింది, టీసర్ ట్రైలర్ లు కూడా తేడా కొట్టినా సాంగ్స్ కొద్దిగా బాగుండటంతో సినిమాలో స్టొరీ ఉంటుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

సినిమాని చూసిన వాళ్ళు ఇదేమి సినిమా అంటూ గగ్గోలు పెట్టారు. ఇక మరో సినిమా సమ్మోహనం ఫస్ట్ లుక్ నుండి టీసర్ ట్రైలర్ వరకు పాజిటివ్ బజ్ ఏర్పడినా సుధీర్ బాబు పాత సినిమాల ప్రభావం వల్ల రిలీజ్ అయ్యే వరకు ఆగాలి అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక సినిమా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల మనస్సు గెలుచుకుని లాస్ట్ వీకెండ్ మూవీస్ లో విన్నర్ గా నిలిచింది సమ్మోహనం సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here