డిసాస్టర్ హోస్ట్ నాని….ఏంటయ్య ఈ పని!

0
428

రియాలిటీ షో బిగ్ బాస్ కాస్త ఇప్పుడు ఆడియన్స్ వర్సస్ బిగ్ బాస్ టీం అండ్ హోస్ట్ గా మారిపోయింది. హౌస్ లో ఒక వ్యక్తి పై అందరూ కలిసి మాటల దాడి చేస్తారు, రాత్రిళ్ళు నిద్రలు మాని మరీ డీ ఫేమ్ చేయాలని చూస్తారు…ఇదంతా తెలిసినా హోస్ట్ మాత్రం ఒక్క మాట కూడా అనరు…

ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరూ చెప్పే డైలాగ్స్ ఇవి…కౌశల్ చేసిన ఒక తప్పు ని అంత సేపు చెప్పగలిగిన నాని మిగిలిన హౌస్ మేట్స్ చేస్తున్న తప్పులను ఒక్కసారి కూడా పరిశీలించకోవడం, పై పెచ్చు కౌశల్ ని సంచలాకుడిగా డిసాస్టర్ అనడంతో హోస్ట్ గా నువ్వే పెద్ద డిసాస్టర్ అంటూ కామన్ ఆడియన్స్ నాని పై దండెత్తుతున్నారు.

హోస్ట్ అంటే అందరినీ ఒకేలా చూడాలి కానీ తన ఫ్రెండ్స్ ని ఒకలా కౌశల్ ని మరోలా చూడటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది…కౌశల్ రోల్ తో మాట్లాడింది తప్పు అని చెప్పిన నాని గీత కౌశల్ పై చేసిన వాక్యాలు, మాట్లాడినా భూతు మాట లు, తన తప్పు లేకున్నా తనపై మోస్తున్న నింధలను నాని అడగనే లేదు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇదంతా చూస్తున్న వాళ్ళు నాని అసలు ఎపిసోడ్స్ చూడటం లేదని, కేవలం శని ఆదివారాల్లో ఇచ్చిన స్క్రిప్ట్ ని అలాగే చదువుతున్నాడని అంటున్నారు. గణేశ్, అమిత్, గీత కౌశల్ ని అన్న మాటలు ప్రతీ షో చూస్తున్న ప్రతీ ఒక్కరూ చూశారు. కానీ నాని కి అవి వినిపించకపోవడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

ఇక తోటి కన్సిస్టంట్ పై ఇలాంటి మాటలు మాట్లాడటం అతి పెద్ద తప్పు అంటూ కౌశల్ కి చెప్పిన నాని అది జోక్ గా చెప్పాను అని చెప్పిన వినలేదు. అదే సమయంలో గతవారం సిల్లీ ఫెలోస్ టీం వచ్చినప్పుడు స్పర్శ లేదా అంటూ నాని చేసిన వాఖ్యలు ఆ తర్వాత జోక్ గా అన్న అని నాని పలికిన విధానం ఇప్పుడు అందరూ నాని డబుల్ స్టాండర్డ్ ని చూపెడుతూ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి వీటన్నింటికి నాని ఎలా సమాధానం చెబుతాడో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here