నాని MCA ప్రీమియర్ షో రివ్యూ…మళ్ళీ కొట్టాడు సామి!!

0
1863

    వరుస విజయాలతో ఓటమి అనేది లేకుండా కెరీర్ ను కొనసాగిస్తూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మెల్లిగా స్టార్ హీరో రేంజ్ కి వచ్చేసిన హీరో నాని… ఎలాంటి స్టార్ బ్యాగ్రాప్ లేకుండా ఈ రేంజ్ కి ఎదిగిన నాని ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టాడు. ఫిబ్రవరి లో నేను లోకల్ అంటూ కెరీర్ బిగ్గెస్ట్ కొట్టిన నాని తర్వాత జులై లో నిన్నుకోరి అంటూ మరో హిట్ కొట్టాడు.

ఇప్పుడు తన కెరీర్ లోనే ఎ సినిమాకు లేనంత హైప్ తో MCA సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు నాని… మరికొన్ని గంటల్లో అఫీషియల్ గా రెగ్యులర్ షోలతో రిలీజ్ కానున్న MCA సినిమా ఈస్ట్ కంట్రీస్ మరియు కొన్ని ఓవర్సీస్ లోకేషన్స్ లో ఆల్ రెడీ రిలీజ్ అయ్యి అక్కడ నుండి టాక్ బయటికి కూడా వచ్చేసింది.

అక్కడ నుండి వస్తున్న టాక్ ప్రకారం నాని మరో హిట్ కొట్ టినట్లే అంటూ చెబు తుండటం విశేషం….. సినిమా మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేం వరకు నాని, భూమిక మరియు సాయి పల్లవి లు అదరగొట్ట గా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ తో ను దుమ్ము లేపాడు అంటు న్నారు.

మొదటి అర్ధభాగం లో వదినా మరిది ల మధ్య ఉండే చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్ సీన్స్ అండ్ టీసింగ్ సీన్స్ అద్బుతంగా పండాయని.. దాంతో పాటే హీరోయిన్ తో హీరో లవ్ స్టొరీ కూడా డిఫెరెంట్ గా అనిపిస్తుందని అంటుండటం విశేషం.

ఇక ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి హీరో విలన్ ల మధ్య పోరు కి రంగం సిద్ధం అవ్వగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్బుతంగా పండి సెకెండ్ ఆఫ్ పై మరింత అంచనాలు పెంచేస్తుందని…అక్కడ నుండి సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తో కొంత సెంటిమెంట్ తో కూడుకుంటుందని అంటున్నారు.

నాని ఎప్పటిలానే తన డైలాగ్ డిలివరీ అండ్ యాటిట్యూడ్ తో దుమ్ము లేపగా సాయి పల్లవి కి ఫిదా లో నటించేంత స్కోప్ లేకున్నా ఉన్నంతలో ఆకట్టుకుందని అంటున్నారు. ఇక భూమిక రోల్ మాత్రం చాలా ఫ్రెష్ గా గుర్తిండి పోయే విధంగా ఉందని అంటున్నారు.

ఓవరాల్ గా అన్ని హంగులతో సినిమా మంచి కమర్షియల్ మూవీ గా తెరకెక్కింది అని…నేను లోకల్ లానే ఇది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్ అవ్వడం పక్కా అంటూ చెబుతుండటం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది… ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ వస్తే నాని ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here