నాని MCA మూవీ రివ్యూ-రేటింగ్ & కామన్ ఆడియన్స్ టాక్!!

0
1549

        భలే భలే మోగాడివోయ్ నుండి ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని ఈ ఏడాది 2017 లో నేను లోకల్ మరియు నిన్ను కోరి లాంటి రెండు సూపర్ హిట్లు కొట్టిన నాని ముచ్చటగా మూడో సినిమా MCA మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది సూపర్ హిట్ల సినిమాలతో ఒక్క ఫ్లాఫ్ లేకుండా 5 సినిమాలు చేసిన దిల్ రాజు నిర్మాణంలో చేసిన ఈ సినిమా…

మంచి అంచనాల నడుమ ప్రీమియర్ షోలతో రిలీజ్ అవ్వగా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది… సాయిపల్లవి కూడా ఫిదా తో సూపర్ ఫామ్ లో ఉండగా డైరెక్టర్ వేణు శ్రీ రామ్ జోష్ ఫ్లాఫ్ తర్వాత భారీ గ్యాప్ తర్వాత చేసిన MCA మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ….

చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అన్నదమ్ముల మధ్య కొంత గ్యాప్ ఎప్పుడు వస్తుంది….అన్నకి పెళ్లి అయ్యి ఇంటికి కొత్త కోడలు వచ్చినప్పుడు అన్న తమ్ముళ్ళ మధ్య కొంత గ్యాప్ వస్తుంది…అలాగే వదిన మరిది ల మధ్య చిన్న చిన్న క్లాష్ రావడం కూడా కామనే.

ఇదే కాన్సెప్ట్ తో MCA మూవీ ని తెరకెక్కించిన వేణు శ్రీ రామ్ మొదటి అర్ధభాగం వరకు సెంట్ మార్కులు దక్కించుకున్నాడు. వదిన గా భూమిక ను ఎంచుకోవడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది సినిమాకి…చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించిన భూమిక సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మొదటి అర్ధభాగం అద్బుతంగా సాగి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు మరింతగా పెంచేయగా స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ అయినా విలన్ విలనిజం పండించడంలో మాత్రం విఫలం అయ్యాడు. ఇక మిగిలిన తారాగణం అంతా తమ తమ పరిదిలో నటించి మెప్పించారు కానీ సినిమా అసలు సిసలు హీరో నాని…

మాత్రం తనదైన స్టైల్ లో డైలాగ్స్ అండ్ నాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుని ఫస్టాఫ్ ని రఫ్ఫాడించగా సెకెండ్ ఆఫ్ లో కూడా చాలావరకు తన సత్తా చాటాడు. సాయి పల్లవి కి ఫిదా తో పోల్చితే నటించడానికి స్కోప్ తక్కువగానే ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకుంది.

ఆమని కొంతవరకు ఆకట్టుకోగా భూమిక మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది….ఆమె నటన సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఇక సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ తో ఓకే అనిపించుకున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ తో మిగిలిన సినిమాలతో పోల్చితే అంచనాలు అందుకోలేకపోయాడు.

వేణు శ్రీ రామ్ దర్శకుడిగా మొదటి అర్ధభాగం ఆదరగోట్టినా సెకెండ్ ఆఫ్ లో మాత్రం పట్టు కోల్పోయాడు…మంచి సిట్యూవేషన్స్ క్రియేట్ చేసినా సెకెండ్ ఆఫ్ పై పట్టుకోల్పోయాడనిపిస్తుంది…కానీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి డోకా లేకపోవడం విశేషం…ప్లస్ పాయింట్…

నాని నేను లోకల్ తో కమర్షియల్ గా ఫుల్ మార్కులు కొట్టేయగా MCA మూవీ తో 80 మార్కులు కొట్టేశాడు సింపుల్ గా MCA మూవీ గురించి చెప్పాలి అంటే ఇదే పెర్ఫెక్ట్….సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here