నవాబ్ టాక్ ఏంటి…హిట్టా ఫ్లాఫా

0
1531

సౌత్ లో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న దర్శకులలో మణిరత్నం అందరికన్నా ముందు నిలిచే దర్శకుడు…కెరీర్ లో ఎన్ని ఫ్లాఫ్స్ ఎదురైనా కానీ మణిరత్నం నుండి సినిమా అంటే మాత్రం అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది… ఈ రోజు మణిరత్నం దర్శకత్వం లో నవాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

ఒక మాఫీయా డాన్…ఆయనకి ముగ్గురు కుమారు…తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థానం మాదే అని ఎవరికి వారే అనుకుంటారు…ఇంతలో తండ్రి చనిపోతాడు…ఈ సమయంలో ఈ ముగ్గురు ఒకరి పై ఒకరికి అనుమానంతో తమ కి పోటీ అనుకుంటూ వేరేవాళ్ళని ద్వేషిస్తారు…దానికి ఒక పోలీస్ హెల్ప్ చేస్తాడు…చివరికి ఈ ముగ్గురు కలిశారా విడిపోయారా అన్నది మిగిలిన కథ.

రొటీన్ కథనే అయినా మణిరత్నం తన మార్క్ టేకింగ్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్ళాడు. ప్రతీ సీన్ ని ఎంతో డీటైల్డ్ గా తెరకెక్కించి మెప్పించాడు…దానికి లీడ్ పాత్రలు ప్రకాష్ రాజ్, జయసుద, అరవింద స్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరి, శింభు, విజయ్ సేతుపతి మరియు త్యాగీ అందరూ అద్బుతంగా సహకరించారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మాఫియా బేసుడ్ మూవీ గా నవాబ్ సినిమాను చెప్పొచ్చు…క్లైమాక్స్ మరింత కొత్తగా ప్లాన్ చేసి ఉంటే సినిమా క్లాసిక్ గా మారేది అన్నది ఎక్కువ మంది భావన…చెలియా తో కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ కొట్టిన మణిరత్నం నవాబ్ తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here