నేల టికెట్టు ప్రీమియర్ షో రివ్యూ…ఏంటి సామి ఇది!!

0
9619

      మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ మూవీ టచ్ చేసి చూడు బాక్స్ ఆఫీస్ ను టచ్ చేయకుండానే వెనుతిరగా ఇప్పుడు రవితేజ నేల టికెట్టు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సోగ్గాడే చిన్ని నాయన మరియు రారండోయ్ వేడుక చూద్దాం అంటూ రెండు వరుస సక్సెస్ లు కొట్టిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన నేల టికెట్టు తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కంబ్యాక్ చేశాడా లేదా అంటే…

పూర్తిగా చేయలేదనే అంటున్నారు ప్రీమియర్ షో లు చూసిన వాళ్ళు. రవితేజ అంటేనే ఎనర్జీ…కానీ ఆ ఎనర్జీ ని కథ కి వాడుకోకుండా చాలా స్లో గా ఉన్న నరేషన్ తో కూడుకున్న కథని ఎంచుకుని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మొత్తంగా ఆకట్టుకోలేకపోయాడు అంటున్నారు.

అనాథగా పెరిగిన అబ్బాయ్, తన చుట్టూ జనం ఉండాలి…జనం మధ్యలో మనం ఉండాలి అని నమ్మే వ్యక్తీ అని, అలాంటి వ్యక్తీ జీవితం లో జరిగిన పరిణామాలు ఎలాంటివి అన్నది సినిమా కథ అని అంటున్నారు.

కథగా చెప్పుకోవడానికి చేయడానికి చాలానే ఉన్నా దర్శకుడు తెరకెక్కించిన విధానం మొదటి అర్ధభాగం రెండో అర్ధభాగం మొత్తం మీద చాలా స్లోగా ఉంటుందని అంటున్నారు. రవితేజ లోని ఎనర్జీని చాలా తక్కువ సీన్స్ లోనే దర్శకుడు వాడుకున్నాడని అంటున్నారు.

జగపతిబాబు కొన్ని సీన్స్ లో విలనిజంతో ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు అన్నీ స్క్రీన్ టైం పెంచినా పెద్దగా ఆకట్టుకోలేదు అంటున్నారు. ఇక సంగీతం పరంగా శక్తి అందించిన పాటలు జస్ట్ ఓకే అనిపించేవిగా ఉన్నాయని, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించేదిగా ఉందని అంటున్నారు.

ఓవర్సీస్ నుండి ఓవరాల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది నేల టికెట్టు సినిమా. ఇక ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే మన ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది అనే దానిపై సినిమా ఫేట్ ఏంటో డిసైడ్ అవుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here