అజ్ఞాతవాసి నైజాంలోఎంత నష్టం తెచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!

0
875

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి పై ఆల్ టైం రికార్డ్ లెవల్ అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే…కాగా సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడంతో కచ్చితంగా సంక్రాంతి సీజన్ లో పంబ రేపుతుంది అని అంతా భావించారు. మొదటి రోజు వసూళ్ళ విషయంలో ఇది చాలా వరకు నిజం అయినా నెగటివ్ టాక్ ప్రభావం సినిమాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

దాంతో రెండో రోజు నుండి కోలుకోలేక పోయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో రెండో రోజు నుండే భారీ డ్రాప్స్ తో షాక్ ఇచ్చింది…అన్ని ఏరియాలు ఒకెత్తు నైజాంలో ఈ సినిమా డ్రాప్ అవ్వడం మరో ఎత్తు అని చెప్పొచ్చు. పవర్ స్టార్ కి నైజాం లో ఉన్న క్రేజ్ అలాంటిది.

కానీ సినిమా టాక్ వలన అక్కడ టోటల్ గా 29 కోట్ల బిజినెస్ కి ఇప్పటి వరకు సినిమా కేవలం 10.45 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టి 11 కోట్ల లోపు బాక్స్ ఆఫీస్ పరుగును ఆపనుంది…ఈ ఒక్క ఏరియాలోనే సినిమాకు 18 కోట్ల నష్టం రానుంది అనేది కన్ఫాం అయ్యింది. ఈ రేంజ్ లో షాక్ ఇస్తుంది అని దిల్ రాజు కూడా అనుకుని ఉండరు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here