ఎన్టీఆర్ కి పోటి ఎవ్వరూ లేరు…మెగా హీరో కామెంట్!!

0
1613

  టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అన్న విషయం అందరికీ తెలిసిందే… డాన్సులలో కానీ యాక్టింగ్ లో కానీ డైలాగ్ డిలివరీలో కానీ మిగిలిన హీరోలలో ఎన్టీఆర్ ముందు నిలుస్తాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు వరుస విజయాలతో అవార్డుల రివార్డుల జోరు లో రికార్డులు సృష్టిస్తూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు.

తన లేటెస్ట్ మూవీ జవాన్ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లో నేటి తరంలో హీరోలలో బెస్ట్ ఎవరు అన్న ప్రశ్న కి తడుముకోకుండా ఎన్టీఆర్ పేరు చెప్పిన సాయి ధరం తేజ్…మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పోటి ఎవరు అని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్న కి…

ఎన్టీఆర్ కి పోటి ఎవ్వరూ లేరండీ…ఆయన డాన్సులు యాక్టింగ్….ఎవ్వరూ టచ్ చేయలేరు…ఎన్టీఆర్ వేరే లీగ్ లో ఉండే హిరో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అందరికీ తెలిసిన విషయమే….జవాన్ మూవీ కి మొదట క్లాప్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పింది ఎన్టీఆర్..దానికి గాను సాయి ధరం తేజ్ ఆడియో సక్సెస్ మీట్ లో మరియు సినిమాలో కూడా స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here