తెలుగు ప్రేక్షకులను మోసం చేసిన నోటా టీం!

0
654

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ నోటా….మంచి అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరకు మంచి వసూళ్లని సినిమా సాధించింది.. కానీ సినిమా విషయంలో నిర్మాతలు తెలుగు ఆడియన్స్ ని మోసం చేశారనే చెప్పాలి.

సినిమా తెలుగు తమిళ్ భాషల్లో రూపొందింది అని చెప్పి ఇక్కడ రిలీజ్ చేయగా చూసిన ప్రతీ ఒక్కరూ ఇది స్ట్రైట్ తెలుగు సినిమా అయితే కాదు అని ఈజీగా గుర్తు పట్టేశారు…ఒక్క సీన్ లో కూడా పెర్ఫెక్ట్ తెలుగు లిప్ సింక్ ఎవ్వరికీ సెట్ అవ్వకపోవడం చివరికి విజయ్ దేవరకొండ సీన్స్ విషయంలో కూడా ఇదే జరగడంతో అందరూ ఇది డబ్బింగ్ మూవీ నా లేక స్ట్రైట్ మూవీ నా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

ఒకవేళ పేరుకు బైలింగువల్ అనుకున్నా ఒక్క ప్రియదర్శి తప్పితే సినిమా లో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు…లాస్ట్ ఇయర్ మహేశ్ స్పైడర్ విషయంలో కూడా ఇదే జరిగింది…ఇప్పుడు నోటా విషయం లో కూడా ఇదే జరిగింది…కానీ స్పైడర్ తెలుగు షూటింగ్ కూడా చేశారు…కానీ నోటా మాత్రం డబ్ చేసి కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్ ని వాడుకుని తెలుగు లో భారీ గా అమ్మారు…

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here