సామి శిఖరం…కర్ణాటక నుండి 9.5 కోట్ల ఆఫర్!!

0
1990

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా 4 విజయాలతో ఫుల్ జోరు మీదున్నాడు….రీసెంట్ గా తెలుగు హీరోలలో ఈ రేంజ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి. సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటు దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికీ సినిమా బిజినెస్ క్లోజ్ కాకపోవడంతో భారీ ఆఫర్స్ వస్తున్నా ఏవి ఫైనల్ అవ్వడం లేదని సమాచారం అందులో పక్క రాష్ట్రం నుండి కూడా ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తుండటం ఈ సినిమా పై నెలకొన్న క్రేజ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు.

కర్ణాటకలో అల్టిమేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో లలో యంగ్ టైగర్ కూడా ఒకరు అవ్వడం, అక్కడ వరుసగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు భారీ గా ఉండటంతో ఎన్టీఆర్ 28 వ సినిమా కి ఇప్పటి నుండే అక్కడ 9.5 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయట. ఇది నిజం అయితే కనుక ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి పక్కకు పెడితే అక్కడ ఇప్పటి వరకు ఏ సినిమా 9.5 కోట్ల బిజినెస్ కూడా అందుకోలేదు. ఈ నెల చివరి వరకు ఇక్కడ బిజినెస్ క్లోజ్ అవుతుంది అని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here