ఇది ఫిక్స్ అయిపోండి….కొన్ని రోజుల్లో….??

0
1057

  టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ…. ఇలా నాలుగు సినిమాలుగా అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే అప్ కమింగ్ మూవీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా మార్చి రెండో వారం నుండి ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా సినిమా యూనిట్ లో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలు….

అతి త్వరలోనే అప్ డేట్ చేయబోతున్నారు యూనిట్ వర్గాలు…కాగా స్టార్ కాస్ట్ లో అలాగే సాంకేతిక నిపుణులలో కొన్ని మార్పులు చేర్పులు జరిగిన విషయం తెలిసిందే.. కాగా సంగీత దర్శకుడిగా అనిరుద్ ని ముందు అనౌన్స్ చేసినా తర్వాత అజ్ఞాతవాసి రిజల్ట్ చూసి మనసు మార్చుకున్నారు.

దేవి ని ఓకే చేసినా కానీ ఎందుకనో అనిరుద్ తో మరోసారి చేయాలి అని భావించినా యూనిట్ మొత్తం నో చెప్పడంతో అనిరుద్ ని తొలగించి దేవి శ్రీ ప్రసాద్ ని ఫైనల్ చేశారు ఎన్టీఆర్28 యూనిట్. అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. ఎన్టీఆర్ కి ఈ మధ్య నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు జైలవకుశతో హాట్రిక్ హిట్స్ ఇచ్చిన దేవి ఆల్ మోస్ట్ డబుల్ హాట్రిక్ కి సిద్ధం అవ్వడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here