ఇది నిజం అయితే అరవింద సమేత పక్కా హిట్

0
624

టాలీవుడ్ లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి….కొందరికి కొన్ని చోట్ల షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని, కొందరికి రిలీజ్ కి ముందు గుడి కి వెళ్తే సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకాలు ఉంటాయి..అలాంటి నమ్మకాలలో ఎన్టీఆర్ కి 9 లక్కీ నంబర్ అని చెప్పొచ్చు. ఇక గత కొంతకాలంగా ఎన్టీఆర్ నటించిన సినిమాల పరంగా కూడా ఒక సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు.

ఫ్లాఫ్ డైరెక్టర్ తో సినిమా ఎన్టీఆర్ సినిమా చేస్తే పక్క హిట్ గ్యారెంటీ గా మారింది అని చెప్పొచ్చు. టెంపర్ నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాలే ఇందుకు నిదర్శనం.టెంపర్ కి ముందు వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న పూరీకి టెంపర్ తో హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్…తన ఫ్లాఫ్స్ కి కూడా బ్రేక్ వేశాడు…ఇక తర్వాత ఫ్లాఫుల్లో ఉన్న సుకుమార్ తో నాన్నకుప్రేమతో తీసి హిట్ కొట్టాడు…

తర్వాత హిట్ ట్రాక్ లో ఉన్న కొరటాలతో జనతాగ్యారేజ్ తో మరో హిట్ కొత్తగా…సర్ధార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ కొట్టిన బాబీ తో జైలవకుశ తో ఆల్ మోస్ట్ క్లీన్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆజ్ఞాతవాసి తో భారీ ఫ్లాఫ్ కొట్టిన త్రివిక్రమ్ తో చేస్తున్న అరవింద సమేత సెంటిమెంట్ ప్రకారం పక్కా హిట్ అవుతుంది అన్నది అందరి మాట. మరి నిజం అవుతుందో లేదో త్వరలో తెలియనుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here