ఫ్యాన్స్ మొదలెట్టారు…ఇక రచ్చ రచ్చే

0
1090

  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబో గా ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే మల్టీ స్టారర్ కోసం అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా మోస్ట్ వాంటెడ్ కాంబో సెట్ అయితే నందమూరి మరియు మెగా ఫ్యాన్స్ ల కలయిక జరగడం ఖాయమని అంతా అను కుంటుండగా మొదట్లో ఈ ప్రాజెక్ట్ పై ఇరు వర్గాల అభిమానులు కొంత నిరాశ చెందారు(కొందరు మాత్రమె)….

కానీ తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం ఖాయం అని తెలుస్తుండటంతో అభిమానులు కూడా ఇప్పటి నుండే ఇద్దరు హీరోల కలయికలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా ఇదే కనుక సినిమా అఫీషియల్ గా లాంచ్ అయితే…

ఈ రచ్చ మరో రేంజ్ లో ఉండే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ భారీ మల్టీ స్టారర్ అన్నీ అనుకున్నట్లు జరిగితే 2018 సెకెండ్ ఆఫ్ లో పట్టాలు ఎక్కుతుందని సినిమా 2020 కి థియేటర్స్ లో సందడి చేస్తుందని అంటున్నారు. DVV దానయ్య ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మక౦గా నిర్మించనున్నారని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here