మామూలు మాస్ కాదు…నాన్ బాహుబలి రికార్డులు పక్కా

4
7728

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ టీసర్ ఎట్టకేలకు వచ్చేసింది. త్రివిక్రమ్ స్టైల్ లో ఎన్‌టి‌ఆర్ ని క్లాస్ గా చూపిస్తాడు అనుకున్నా అందరికీ శాకిచ్చాడు త్రివిక్రమ్.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటిని మరిపిస్తూ ఊరమాస్ గా ఎన్‌టి‌ఆర్ ని చూపించిన విధానం టీసర్ కి అల్టిమేట్ హైలెట్ గా నిలిచింది. ఇక జగపతిబాబు పలికిన మచ్చల పులి డైలాగ్ అండ్ టీసర్ చివర్లో ఎన్‌టి‌ఆర్ పలికిన కంటపడ్డవా కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తా!!…

డైలాగ్ ఓ రేంజ్ లో పేలింది. టీసర్ లో చూసింది సాంపుల్ మాత్రమే సినిమాలో ఓ రేంజ్ పూనకాలు తెప్పించే సీన్స్ ఉన్నాయని చెబుతుండటంతో అవి నిజం అయితే నాన్ బాహుబలి రికార్డుల వర్షం పక్కా అని చెప్పొచ్చు. మీరు టీసర్ చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here