ఇవి నిజం అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం!

0
1421

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అత్యంత భారీ ఎత్తున అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమాలో ఫ్యాన్స్ కోసం భారీ గా సీన్స్ ని పెట్టారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఆ న్యూస్ ప్రకారం సినిమాలో హైలెట్స్ చాలా ఉన్నాయని అంటున్నారు. మొదటి 20 నిమిషాల ఎపిసోడ్ సింహాద్రి-ఆది లను మరిపించేదిగా ఉంటుందట. ఇక సినిమాలో మొత్తం మీద 4 భారీ యాక్షన్ ఫైట్స్ అలాగే 2 చిన్న బిట్ ఫైట్స్ ఉంటాయట.

అందులో రెండు ఫైట్స్ ఒకటి ఇంటర్వెల్ లో ఒకటి సెకెండ్ లో ఒక ఎమోషనల్ సీన్ తర్వాత వస్తాయని ఆ 2 ఫైట్ సీన్స్ సినిమా లెవల్ లో ఆకాశానికి పెరిగేలా చేస్తాయని అంటున్నారు. ఇక సాంగ్స్ అన్నీ సూపర్ గా కుదిరాయని చెబుతున్నారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ వార్తలు కనుక నిజం అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవ్వడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here