కెరీర్ బెస్ట్ రికార్డ్ బెండు తీసిన అరవింద సమేత…ఊరమాస్!!

0
7123

  తెలుగు సినిమా హీరోలలో అన్ని వర్గాలలో అల్టిమేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే… సినిమా సినిమా కి తన రేంజ్ ని క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై అంచనాలు ఎ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీ గా పెరిగిపోగా అన్ని ఏరియాల్లో బిజినెస్ ఆఫర్స్ ఓ రేంజ్ లో దక్కుతున్నాయి ఈ సినిమా కి. కానీ నిర్మాతలు ఇంకా ఏ ఆఫర్ కూడా ఫైనల్ చేయకున్నా ఇప్పుడు ఓవర్సీస్ నుండి ఓ అద్బుతమైన ఆఫర్ ఈ సినిమా కి దక్కిందని సమాచారం.

ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డ్ లెవల్ లో ఈ సినిమా కి గాను 11 కోట్ల ఆఫర్ కేవలం అమెరికా కి గాను దక్కిందట. కానీ నిర్మాతలు సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయిన తర్వాతే సినిమా బిజినెస్ ని మొదలు పెట్టాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here