యూట్యూబ్ లో సంచలనం::తెలుగుసినిమాకి 2 కోట్ల ఆల్ టైం వ్యూస్

0
124

ntr dammu 2 crయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఎక్కువగా హిందీలో డబ్ అవ్వడం జరుగుతుంది, ఎన్టీఆర్ నటించిన హిట్ అండ్ ఫ్లాఫ్ సినిమాలు అన్నీ హిందీలో డబ్ అయ్యి టీవిలో మంచి టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుని రికార్డులు సాధించాయి. కాని అన్ని సినిమాల కన్నా ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా అక్కడ ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

ఈ సినిమాను దాదాపు మూడేళ్ళుగా మూడు సార్లు హిందీ డబ్బింగ్ లో యూట్యూబ్ చానెల్స్ లో పెట్టగా మొదటిసారి 6.3 మిలియన్ వ్యూస్, మరోసారి 4 మిలియన్ వ్యూస్, మూడో సారి 10 మిలియన్ వ్యూస్ ని తెచ్చుకుంది.

దాంతో మొత్తంగా ఈ సినిమాను 2 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాతో పోల్చితే మిగతా సినిమాల వ్యూస్ అన్నీ తక్కువగానే ఉన్నాయి.

అందులో హిట్ సినిమాలకు కూడా రానన్ని వ్యూస్ దమ్ము సినిమాకు రావడం విచిత్రంగా ఉంది. ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అందరికీ అర్ధం అయ్యేలా చేసిన ఈ సినిమాతో ఎన్టీఆర్ కి నార్త్ లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. ఇకమీదట ఎన్టీఆర్ నటించే సినిమాలకు కూడా ఇలాంటి రికార్డులు కామన్ అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here