వాళ్ళు కొట్టారు…యంగ్ టైగర్ కొట్టి తీరాల్సిందే

0
762

టాలీవుడ్ హీరోలలో అన్ని ఏరియాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు…మిగిలిన ఏరియాలతో పోల్చితే సీడెడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ లెవల్ వేరే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు…కానీ నైజాం లో మాత్రం ఎన్టీఆర్ కి ఫస్ట్ డే రికార్డులు తప్పితే కొత్త రికార్డులు లేవు..

టోటల్ రన్ లో అక్కడ ఒక్కసారి కూడా ఎన్టీఆర్ 20 కోట్ల మార్క్ ని అధిగమించలేదు…జనతా గ్యారేజ్ ఒక్కటే ఆ మార్క్ కి చేరువగా వచ్చింది. టోటల్ రన్ లో 19.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…ఇదే సమయంలో మిగిలిన హీరోల సినిమాలకు ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.

అందుకే ఇప్పుడు అత్యంత భారీ ఎత్తున త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా తో నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కచ్చితంగా సరికొత్త రికార్డులతో పాటు 20 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడతాడో లేదో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here