ఇదొక్కటి కొట్టు చాలు…ఇక తోపు నువ్వే!!

0
577

 టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సాధించని రికార్డ్ లేదనే చెప్పాలి… ఓపెనింగ్స్ రికార్డులు కానీ యూట్యూబ్ రికార్డులు కానీ సోషల్ మీడియా లో ట్రెండింగ్ రికార్డులు కానీ కలెక్షన్స్ రికార్డులు కానీ అనేక రికార్డులను కెరీర్ స్టార్టింగ్ లోనే సొంతం చేసుకున్నా తర్వాత స్లో అయిన ఎన్టీఆర్ తిరిగి టెంపర్ నుండి తన జోరు పెంచుతూ సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ మరింత దూసుకు పోతున్నాడు.

ఇన్ని చేసిన ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పుడు బాలెన్స్ ఉన్న ఏకైక రికార్డ్ ఒకటుంది…అదే నైజామ్ లో 20 కోట్ల మార్క్ ని అందుకునే రికార్డ్…. టాలీవుడ్ టాప్ హీరోలలో కేవలం ఎన్టీఆర్ కి మాత్రమె నైజాం లో 20 కోట్ల మార్క్ మిస్ అయ్యిందని చెప్పొచ్చు. కెరీర్ మొదటి నుండి మాస్ బాట పట్టడం తో నైజాంలో పెద్దగా రికార్డులు క్రియేట్ చేయలేదు.

కానీ టెంపర్ తో ఇక్కడ 19.5 కోట్ల షేర్ ని అందుకుని 20 కోట్ల మార్క్ ని మిస్ అయిన ఎన్టీఆర్ జైలవకుశ తో అందుకుంటాడు అనుకున్నా అది కూడా మిస్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఉన్నపళంగా ఈ ఏరియా లో 20 కోట్ల మార్క్ ని అందుకోవడం ఎన్టీఆర్ కర్వవ్యంగా మారింది అని చెప్పొచ్చు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా రిలీజ్ సమయానికి టాలీవుడ్ లో బడా మూవీస్ అన్ని రిలీజ్ ఉండటం తో అవన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే నైజామ్ లో అ సినిమాలు  20 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం.

దాంతో ఎన్టీఆర్ కి ఇక్కడ అప్పుడు 20 కోట్లు టార్గెట్ కాదని చెప్పొచ్చు కచ్చితంగా 25 కోట్ల లీగ్ లో అడుగు పెడితేనే ఎన్టీఆర్ తన స్పెషాలిటీని ఇక్కడ చూయించుకున్నట్లు ఉంటుంది. మరి త్రివిక్రమ్ తో చేసే సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here