15 తగ్గాల్సిందే…ఎన్టీఆర్-త్రివిక్రమ్ షాకింగ్ అప్ డేట్

0
826

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి నాన్ స్టాప్ గా జరగబోతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఇప్పటి వరకు చూపని విధంగా సరికొత్త లుక్ లో చూపాలి అను కుంటు న్నాడు.

అందుకోసమే ఎన్టీఆర్ ని బరువు తగ్గాలని కోరగా జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ కోసం బరువు పెరిగిన యంగ్ టైగర్ ఈ సినిమా కోసం 15 కిలోల బరువు తగ్గే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్న ఎన్టీఆర్ వచ్చిన వెంటనే ఈ పనిలో ఉండబోతున్నాడట.

అల్ట్రా స్లిమ్ లో కాలేజ్ స్టూడెంట్ లుక్ లో ఎన్టీఆర్ ఈ సినిమా లో కనిపించే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. 4 వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఉన్నాయి. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here