హిస్టరీ రిపీట్స్…6 ఇయర్ ట్రాక్ రికార్డ్ కంటిన్యు…మాస్ పవర్

0
2017

  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సినిమా సినిమా కి తన రేంజ్  ని పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఇక్కడన్నా మధ్యలో రామయ్యావస్తావయ్యా రభస లాంటి ఫ్లాఫ్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు కానీ కర్ణాటకలో మాత్రం అదిరిపోయే ట్రాక్ రికార్డ్ ను మెయిన్ టైన్ చేస్తూ సంచలన రికార్డ్ నమోదు చేశాడు.

గత 6 ఏళ్లలో ఇక్కటంటే ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వకుండా లేదంటే అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన జైలవకుశ కూడా అక్కడ 8.6 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్ ని ముగించేసింది.

టోటల్ రన్ లో ఈ సినిమా అక్కడ 8.9 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో అక్కడ ఎన్టీఆర్ ట్రాక్ రికార్డ్ 6 ఏళ్ళు అయినా ఇంకా కంటిన్యు అవుతుందనే చెప్పాలి. ఇదే జోరు ని ఎన్టీఆర్ రానున్న సినిమాలకు కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here