“ఎన్టీఆర్” మరోసారి “బొమ్మరిల్లు” లాంటి సినిమా మిస్ అయ్యాడు

0
528

కథల ఎ౦పిక విషయంలో చేసిన పొరపాట్లతో వరుస ఫ్లాఫ్ లు ఎదుర్కొన్న ఎన్టీఆర్ తర్వాత తనని తానూ మార్చుకుని సరైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ప్రస్తుతం ఉన్న హీరోలలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా 4 ఏళ్ళు గా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. దా౦తో పాటుగా కథల ఎ౦పిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకు౦టున్నాడు. అలా చేసిన టెంపర్ నుండి అరవింద సమేత వరకు ప్రతీ సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల మనస్సును గెలుచుకుని సత్తా చాటుతున్నాడు.

ప్రస్తుతం RRR తో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కమిట్ మెంట్స్ ఏవి ఓకే అవ్వలేదు. దాంతో ఒక దర్శకుడి తర్వాత ఒకరు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కథలను ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మొదట నాతొ సినిమా చేయాలి అనుకున్నాడు బొమ్మరిల్లు ఫేం భాస్కర్.

జైలవకుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉందని వార్తలు రాగా తరువాత అటకెక్కింది, కాని ఒకవేళ ఒకే అయితే అది బొమ్మరిల్లు భాస్కర్ తోనే చేయాల్సిందట. ఇది వరకు ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాలు ఎన్టీఆర్ తోనే అనుకున్నా…..

అవి వదులుకున్న ఎన్టీఆర్ ప్లేస్ లో సిద్దార్థ్-అల్లుఅర్జున్ లతో హిట్లు కొట్టాడు భాస్కర్. తర్వాత ‘ఆరెంజ్’ ‘ఒ౦గోలు గిత్తా’ వ౦టి అట్టర్ ప్లాప్ లతో కనుమరుగైన భాస్కర్ యంగ్ టైగర్ కి ఓ రేంజ్ కథను సిద్ధం చేశాడట. బృ౦దావన౦, రామయ్య వస్తావయ్యా సినిమాల తరువాత దిల్ రాజు బ్యానెర్ లో ఎన్టీఆర్ నటి౦చబోయే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందట.

దాంతో ఆ సినిమా ప్లేస్ లో తమిళ్ లో బెంగళూర్ డేస్ రీమేక్ చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆ సినిమా డిసాస్టర్ అవ్వడంతో మళ్ళీ తెరపైకి రాలేదు.. కానీ ఇప్పటికిప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తానని అంటున్నాడు బొమ్మరిల్లు దర్శకుడు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here