మెగా హిరో మూవీ…థియేటర్ లో ఎన్టీఆర్ క్రేజ్…వాట్ ఏ రెస్పాన్స్!

0
1921

  అందరికీ తెలిసిన విషయమే… మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ ఓపెనింగ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి కెమరా స్విచ్ ఆన్ చేసి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని… కాగా ఇదే విషయాన్ని జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి సమక్షంలో చెప్పి ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పిన సాయి ధరం తేజ్ ఇప్పుడు సినిమాలో కూడా థాంక్స్ చెప్పాడు.

సినిమా స్క్రోలింగ్స సమయంలో థాంక్స్ టు నందమూరి తారకరామారావు అంటూ పేరు పడగానే థియేటర్ మొత్తం ఓ రేంజ్ లో షేక్ అయ్యింది. ఇది వరకు ఇది తక్కువే అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల సినిమా న్యూస్ నుండి అందరి ఫ్యాన్స్ కలిసిపోయారు.

ఇక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఎస్.ఎస్.రాజమౌళి చేయబోతున్న అల్ట్రా హిస్టారికల్ మల్టీస్టారర్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కనుక మొదలు అయితే ఇక ఫ్యాన్ వార్స్ దాదాపు ఉండకపోవచ్చు అనేది ఇండస్ట్రీ టాక్. మరి మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here