మెగా హీరో ఈవెంట్ లో ఎన్టీఆర్ పేరు…తర్వాత ఏమైందో తెలుసా??

0
4729

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా హీరోల మధ్య స్నేహం మరింత బలపడింది… మెగా హీరోల ఈవెంట్ కి ఎన్టీఆర్ వెళ్ళడం… ఎన్టీఆర్ మూవీ ఈవెంట్ కి మెగా హీరోలు రావడం… ఒకరి సినిమాలు ఒకరి చూడటం లాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జక్కన్నలతో దిగిన ఫోటో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది.

కాగా అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ కి కూడా చేరువ అవుతున్న ఎన్టీఆర్ పేరు ఇప్పుడు మెగా హీరోల ఈవెంట్ లో వినపడటం  అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ లేటెస్ట్ మూవీ జవాన్ మూవీ ప్రారంభోత్సవం చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కాగా ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకి మొదటి క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు అంటూ హరీష్ శంకర్ మరియు సాయిధరం తేజ్ లు చెప్పడంతో విజిల్స్ తో అంతా షేక్ అయ్యింది. దాంతో మెగా హీరోలు మరియు ఎన్టీఆర్ కలవడమే కాదు ఇప్పుడు అభిమానులు కూడా మెల్లగా ఒకటి అవుతుండటం ఇండస్ట్రీకి మంచి పరిణామం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here