ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసే హీరో టాలీవుడ్ లో లేడు

0
3775

  ప్రసుతం ఉన్న టాప్ హీరోల్లో అందరికన్నా ముందు 27 సినిమాలు పూర్తి చేసి ఫాస్ట్ గా ఈ మార్క్ ని అందుకున్న హీరో అనిపించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందులోనూ 26 వ సినిమాతో 85 కోట్ల మార్క్ ని అందుకుని ఎన్టీఆర్ ఖాతాలో మరో రేర్ రికార్డు కూడా ఉంది.  ఆ రికార్డు ఏంటంటే కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన 26 సినిమాల్లో సుమారు 23 సినిమాల్లో గెటప్ చేంజ్ చేశాడు ఎన్టీఆర్. అంటే దాదాపు అన్నీ సినిమాల్లో తన లుక్ ని మార్చుకున్నాడు అన్నమాట, ఇలా మరే టాలీవుడ్ హీరో కూడా తన సినిమాలన్నీ౦టిలో లుక్ ని మార్చలేదు.

సౌత్ లో కమల్ హాసన్ ఒక్కడే ఎక్కువగా తన లుక్స్ ని సినిమా సినిమాకు చేంజ్ చేశాడు, టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఒక్కడే ఈ విధంగా తన లుక్స్ ని సినిమా సినిమాకు మార్చుకుని ఇప్పుడు 27 వ సినిమా కోసం ఏకంగా మూడు కొత్త లుక్స్ లో దర్శనం ఇచ్చాడు ఎన్టీఆర్….

జై లవ మరియు కుశ మూడు పాత్రలకు మూడు డిఫెరెంట్ గెటప్స్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ సినిమా సినిమా కి గెటప్స్ విషయం లో శ్రద్ధ ఎక్కువగా తీసుకుని ఇప్పుడు టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లో ఎక్కువ గెటప్స్ వేసిన ఓకే ఒక్క హీరోగా చరిత్ర కెక్కాడు. ఈ రికార్డ్ బహుశా రానున్న కాలంలో బ్రేక్ అయ్యే అవకాశం తక్కువే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here