టెంపర్ సినిమా పరువు తీశేలా ఉన్నారే!!

0
2521

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో నటుడిగా సరికొత్త పాత్ర చేసిన సినిమా టెంపర్…నెగటివ్ షేడ్స్ లో అదరగొట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా కి వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచాడు. ఎన్టీఆర్ సరికొత్త లుక్, నెగటివ్ షేడ్స్ ఆ సినిమా రేంజ్ మారేలా చేశాయి. ఆ సినిమా చూసిన ఇతర ఇండస్ట్రీ ల వారు ఈ సినిమా ను రీమేక్ చేసే సత్తా లేదని తప్పుకోవడం తో రీమేక్ చాలాకాలంగా ఆగిపోయింది.

దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ టెంపర్ ని హిందీ లో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరో గా “సింబా” గా రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా ఇప్పుడు రీసెంట్ గా ఆ సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా అది చూసిన టాలీవుడ్ విశ్లేషకులు టెంపర్ కథని మార్చేలా ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.

టెంపర్ సినిమా సీరియస్ గా సాగే పోలిస్ కథ…కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి సింగం లాంటి యాక్షన్ మూవీస్ చేయడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో చేస్తాడని అనుకున్నా ఫస్ట్ లుక్ లో రణవీర్ టపోరి లుక్ చూసి కథని భారీగా మార్చినట్లు అర్ధం చేసుకున్నారు…మరి భారీ మార్పులు చేసి టెంపర్ పరువు తీయకుండా ఉంటె బాగుణ్ణు అని మనవాళ్ళు కోరుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here