180 రోజులు ఆగక తప్పదు…ఫ్యాన్స్ నిరాశ

0
1760

  మూడు వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసినా GST మరియు కొత్త సినిమాల పోరు వల్ల ఓవరాల్ గా సెమీ హిట్ వైపు అడుగులు వేస్తుంది. కాగా ఈ సినిమా తో అభిమానులను నటుడిగా ఫుల్ సాటిస్ ఫై చేసిన ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే మాస్ అంశాలన్నీ జై రోల్ లో అందించి అందరి మెప్పు పొందాడు.

కాగా ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకేక్కే ఈ సినిమా ఇప్పట్లో మొదలు అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

నవంబర్ చివర్లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ మార్చి చివరన నుండి జరగనుందట. దాంతో అప్పటి వరకు సుమారు 180 రోజుల పాటు ఎన్టీఆర్ వెయిట్ చేయబోతున్నాడట…ఈ గ్యాప్ లో ఈ సినిమా కోసం బరువు తగ్గి స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ లో సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ని అంత కాలం చూడకుండా ఉండలేమని నిరాశ వ్యక్తం చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here