బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ అవుట్…ఎన్టీఆర్ ఊచకోత!

0
1505

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు రాష్ట్రాలలో స్ట్రాంగ్ జోన్ ఏది అంటే కచ్చితంగా సీడెడ్ ఏరియా అని చెప్పాలి… మిగిలిన హీరోల కన్నా ఇక్కడ ఎన్టీఆర్ మూవీస్ టాక్ కి అతీతంగా అద్బుతమైన వసూళ్లు రాబడుతాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈ ఏరియాలో ఓపెనింగ్ రోజు నుండే సంచలన కలెక్షన్స్ తో అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోవడం మనం చూస్తూనే ఉన్నాం.

కాగా సినిమా మొదటి వారం కలెక్షన్స్ పరంగా ఇక్కడ ఆల్ టైం నాన్ బాహుబలి 2 రికార్డ్ ను నమోదు చేయగా రంగస్థలం మరియు బాహుబలి 1 సినిమాల రికార్డులను కేవలం 6 రోజులలోనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. రంగస్థలం మొదటి వారం ఇక్కడ 11.3 కోట్ల షేర్ ని అందుకోగా బాహుబలి పార్ట్ 1 12.1 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇప్పుడు 6 రోజుల్లోనే అరవింద సమేత ఇక్కడ 12.45 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 7 వ రోజు వసూళ్ళతో కలిపి 13 కోట్లకి క్లోజ్ గా వెళ్ళే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది నిజంగా ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here