ఏంటి సామి ఈ టైటిల్…టోటల్ టాలీవుడ్ షాక్

0
7108

  టెంపర్ నుండి సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా జైలవకుశ సినిమాతో మరో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అప్ కమింగ్ పై టోటల్ టాలీవుడ్ భారీ క్రేజ్ ఏర్పడింది. డానికి కారణం ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తుండటమే.. కాగా అంచనాలు భారీ గా ఉన్న ఈ సినిమా టైటిల్ పై రచ్చ ఇప్పటి నుండే మొదలయింది.

ఇండస్ట్రీ లో ఈ సినిమా టైటిల్ పై రోజుకో వార్తా ప్రచారం లో ఉండటం విశేషం… మొదట్లో సోల్జర్ అని తర్వాత, రాముడు భీముడు అంటూ కొన్ని పోస్టర్స్ రిలీజ్ అవ్వగా ఈ సినిమాను నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని ప్రొడక్షన్ వారు ఓ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.

ఆ టైటిల్ పేరు “ఆన్ సైలెంట్ మోడ్”…. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఎన్టీఆర్ తో సినిమాకు ఈ టైటిల్ ని వాడతారా అనేది ఆసక్తి కరంగా మారింది. త్వరలోనే సెట్స్ పైకి వెల్ల నున్న ఈ సినిమా 2018 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here