ఎన్టీఆర్28 మూవీ లాంచ్..ఎన్టీఆర్-పవన్..ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు

0
1178

  ఎవ్వరూ ఊహించనిది జరిగినప్పుడు పొందే సంతోషం అంతా ఇంతా కాదు… టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఓకే ఫ్రేమ్ లో కలుస్తారు అని ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా… కానీ ఈ ఇద్దరు స్టార్స్ కలిసారు… ఎన్టీఆర్ అప్ కమింగ్ సెన్సేషన్ మూవీ ఎన్టీఆర్ 28 మూవీ లాంచింగ్ సమయంలో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కి తొలి షాట్ ని ఇచ్చారు.

కాగా ఈ ఈవెంట్ లో పవన్ మరియు ఎన్టీఆర్ లు సరదా గా గడిపిన తీరు అందరినీ ఆకట్టుకోగా మెగా మరియు నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనా అన్న విధంగా ఉండే ఫ్యాన్స్ కూడా…

వీళ్ళని ఓకే ఫ్రేమ్ లో చూసి మురిసిపోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.. సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వరుస విజయాల పరంపర ఈ సినిమా కూడా కొనసాగించడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here