అక్టోబర్ 3…మచ్చల పులి భీభత్సం!

0
2063

టాలీవుడ్ యంగ్ టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత…గత నాలుగు సినిమాలుగా సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా తో కూడా ఆ రికార్డుల పర్వం కొనసాగించాలని చూస్తున్నాడు.

ఇక సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అనేది అందరి లోనూ ఆసక్తిని రేపుతుంది. కాగా అరవింద సమేత షూటింగ్ మొత్తం ఈ నెల చివరి వరకు పూర్తి అవుతుందని సమాచారం.

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 3 న భారీ ఎత్తున నిర్వహించబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది…ఒకరోజు ముందు గాని ఒకరోజు వెనక గాని జరిగే అవకాశం కూడా ఉన్న అక్టోబర్ 3 నే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here