బడ్జెట్ 20 కోట్లు…బిజినెస్ 13.5 కోట్లు…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1494

  లౌక్యం తర్వాత అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఇప్పట్లో హిట్ ప్రాప్తి లేదనే అనిపిస్తుంది…ఈ ఇయర్ రిలీజ్ అయిన గౌతమ్ నంద కి మంచి ఓపెనింగ్స్ తో పాటు మంచి టాక్ వచ్చినా సినిమా టోటల్ రన్ లో బిజినెస్ కు చాలా దూరంలోనే ఆగిపోయి డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ తో రిలీజ్ అయిన ఆక్సీజన్ పరిస్థితి ఇలానే ఉంది.

మూవీ మొదటి రోజు నుండే పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేయగా సినిమా టోటల్ బడ్జెట్ 20 కోట్ల వరకు ఉండగా సినిమా బిజినెస్ కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ అవ్వడం మిగిలిన ఏరియాల బిజినెస్ రేంజ్ 13.5 కోట్ల వరకు ఉండటం మినిమమ్ 14 కోట్ల వరకు సినిమా కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలిచేది.

కానీ సినిమా మొదటి వీకెండ్ 3 కోట్ల వరకు మాత్రమే వసూల్ చేయగా మిగిలిన రోజుల్లో పూర్తి గా డల్ అయ్యి కేవలం 1 కోటి షేర్ ని మాత్రమే వసూల్ చేసింది. దాంతో ఫస్ట్ వీక్ వసూళ్లు 4 కోట్ల వరకు మాత్రమే ఉండటంతో సినిమా సేఫ్ అవ్వడం ఇక కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. ఇక గోపీచంద్ కి క్లీన్ హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here