ఆక్సీజన్ ఫస్ట్ వీకెండ్(4 డేస్) కలెక్షన్స్…ఇంకో “సారి”

0
1040

  యాక్షన్ హీరో గోపీచంద్ హీరో గా మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరోయిన్స్ రాశిఖన్నా మరియు అను ఎమాన్యుఏల్ ల కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ ఆక్సీజన్… సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అయ్యి చివరికి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు మొత్తం మీద 1.57 కోట్ల షేర్ ని రెండో రోజు మొత్తం మీద 90 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా మూడో రోజు మరింత తగ్గింది.

మూడో రోజు అఫీషియల్ లెక్కల ప్రకారం 40 లక్షల లోపు షేర్ ని మాత్రమే వసూల్ చేసిందట…ఇక 4 వ రోజు ఆదివారం అయినా కూడా సినిమాకి పెద్దగ ఉపయోగం ఏమి జరగలేదు. సినిమా కేవలం 35 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం…..

దాంతో మొత్తం మీద 4 రోజుల్లో 3.27 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసిన ఆక్సీజన్ సినిమా గోపీచంద్ సినిమాల్లో మరోసారి అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాగా నిలవనుంది… గౌతమ్ నంద కూడా మంచి టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆక్సీజన్ మరో 10 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ క్లీన్ హిట్ గా నిలిచే చాన్స్ లేదు…మరి తొలి వీకెండ్ ఆదివారం రోజునే 35 లక్షల వరకు కలెక్ట్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here