ఆక్సీజన్ మూవీ కి ఎన్టీఆర్ కి సంభందం ఏంటి??

1
1394

రీసెంట్ గా రిలీజ్ అయిన గోపీచంద్ లేటెస్ట్ మూవీ ఆక్సీజన్ ఫలితం ఏంటి అనేది పక్కకు పెడితే సినిమా స్టొరీ లైన్ ని చూసిన వాళ్ళందరికీ ఇది వరకే ఆ పాయింట్ తో సినిమా చూసిన ఫీలింగ్ కలగక మానదు. మరీ ముఖ్యంగా మొదటి అర్ధభాగం చూసిన వాళ్ళందరికీ కచ్చితంగా ఓ సినిమా స్ట్రైక్ అవ్వడం ఖాయం… ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యావస్తావయ్యా…

మొదటి అర్ధభాగం సినిమా సేం కాన్సెప్ట్ రామయ్యావస్తావయ్యా సినిమాలో చూసిన విధంగానే ఉంటుంది. హీరోయిన్ కుటుంబాన్ని చంపాలి అని కొందరు చూస్తుండటం…కొందరు మిస్ అవ్వడం… అప్పుడు అనుకోకుండా హీరో హీరోయిన్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం ఇంటర్వెల్ లో హీరోయిన్ ఫ్యామిలీ ని తనే చంపడం జరుగుతుంది.

దాంతో ఇప్పుడు ఆక్సీజన్ సినిమా ను చూసిన వాళ్ళు అందరూ ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా సినిమాను ఇన్స్పైర్ అయ్యే ఆక్సీజన్ చేశారని అంటున్నారు. కానీ సినిమా సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లో సోషల్ మెసేజ్ ని ఎంచుకుని కొంచం కొత్త ఫీల్ ని కలిగించినట్లు చెబుతున్నారు. మీరు సినిమా చూస్తున్న సమయంలో ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా సినిమా గుర్తుకు వచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here