పైసావసూల్ రివ్యూ అండ్ రేటింగ్…తేడా సింగ్…భీభత్సం ఇది

3
533

2017 ఇయర్ స్టార్ టింగ్ లో సంక్రాంతి కానుకగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా మూడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో హిస్టారికల్ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకున్నా ప్రేక్షకులను ఆకట్టు కుని టోటల్ రన్ లో 60.60 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దాంతో పాటే బాలయ్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

కాగా అలాంటి హిస్టారికల్ విజయం తర్వాత బాలయ్య పూర్తిగా తన పంథాని మార్చుకుని పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ అంటూ పక్కా కమర్షియల్ మాస్ మూవీ ని ఒప్పుకుని నేడు ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ ఎత్తున కెరీర్ లో బిగ్గెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సుమారు 1000 థియేటర్స్ కి పైగా సినిమా ఓపెన్ అవ్వగా సినిమా గురించి తెలుసుకుందాం పదండి..

సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్నాథ్ ఇది వరకు అందించిన పోకిరి, బిజినెస్ మాన్, టెంపర్ లాంటి సినిమాలు కళ్ళముందు కనిపిస్తాయి…పూరీ ఇంకా ఆ హ్యాంగోవర్ నుండి బయట పడలేదు అని పించడం మాత్రం ఖాయం…కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఇలాంటి కథ ని చేయని బాలయ్య ఈ సినిమాలో ఉండటం తో సినిమాపై ఆసక్తి కలుగుతుంది..

కథ గురించి కొద్దిగా తెలుస్తున్నట్లు అనిపించినా బాలయ్య పెర్ఫార్మెన్స్ తో మరింతగా రక్తి కట్టింది అని చెప్పొచ్చు, కానీ చాలా చోట్ల బాలయ్య వాయిస్ లో ఇది వరకు ఉన్న పవర్ మిస్ అయ్యింది అని చెప్పొచ్చు, కానీ ఓవరాల్ గా బాలయ్య వన్ మ్యాన్ ఆర్మీ గా నడిపాడు. హీరోయిన్స్ ఉన్నంతలో బానే చేశారు కానీ కమర్షియల్ సినిమాల్లో ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకున్నాడు బాలయ్య.

ఇక అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సినిమాకు అక్కడక్కడా ప్రాణం పోసింది…కానీ ఓవరాల్ గా కేవలం అనూప్ రూబెన్స్ పాస్ మార్కులు మాత్రమె వేయించుకున్నాడు. సినిమా ఎడిటింగ్ బాగానే ఉన్నా మరింత ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది…ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా డ్రాగ్ అయిందని అనిపిస్తుంది.

పూరీ జగన్నాథ్ మునుపటి ఫామ్ ని ఆల్ మోస్ట్ అందుకున్నట్లే అనిపించినా పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా పుంజుకోలేదు…ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండగా ఓవరాల్ గా పైసా వసూల్ బాలయ్య కోర్ మాస్ ఆడియన్స్ కి అలాగే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ లాంటి సినిమా.

కానీ అదే సమయంలో రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం వన్ టైం వాచబుల్ సినిమా అని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళని సినిమా పూర్తి స్థాయి లో ఆకట్టు కో గలిగితే సినిమా జైలవకుశ కి ముందు 20 రోజుల గ్యాప్ లో అదిరిపోయే వసూళ్లు కురిపించే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ట్రేడ్ పండితుల ఫస్ట్ ప్రిడిక్షన్ మాత్రం 35 కోట్ల+++అని చెప్పొచ్చు…సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5…..మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here