పంతం ఆడియో రిలీజ్ డేట్…ట్రైలర్ ఎప్పుడంటే!

0
696

హిరో నుండి విలన్ కి…తిరిగి విలన్ నుండి హీరో గా మారి మంచి విజయాలను సొంతం చేసుకున్న గోపించంద్ ఈ మధ్యకాలంలో మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోయాడు. గౌతమ్ నంద లాంటి సినిమా బాగున్నా సరైన టైం లో రిలీజ్ చేయకపోవడంతో ఫ్లాఫ్ అయ్యింది. ఇక ఆక్సీజన్ కూడా అలానే జరిగింది అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా పంతం సినిమాను చేస్తున్నాడు గోపీచంద్.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ని 21 న సాయంత్రం 6 గంటలకు విజయవాడలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ కి మంచి పాజిటివ్ టాక్ లభించింది.

సినిమాలో గోపీచంద్ పెర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో వేడుకలోనే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట. సినిమా జులై మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తో అటు కంబ్యాక్ ని ఇటు 25 వ సినిమాతో హిట్ ని సొంతం చేసుకోవాలని గోపించంద్ చూస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here