నంది అవార్డుల పై పోసాని కామెంట్స్…ఏంటి సామి ఈ రచ్చ

0
1251

రీసెంట్ గా రిలీజ్ చేసిన నంది అవార్డులలో కొన్ని తప్పులు జరిగాయి అన్నది వాస్తవం….అన్ని సినిమాలకు కాకున్నా కొన్ని సినిమాల విషయంలో కొంత తప్పు జరిగింది అని అందరూ చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వినిపిస్తున్న వార్తలు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు గారు కొంత తప్పు జరిగింది అని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నా మిగిలిన వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఇక మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డ్ లేని వాళ్ళు ఇక్కడి అవార్డ్ లపై కామెంట్స్ చేయడం ఏంటి అంటూ కొత్త గొడవకి నాంది పలకగా సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి ఈ సందర్బంగా పలు విమర్శలు చేశాడు. పోసాని ఏమన్నారంటే…

“నంది అవార్డ్ ల వివాదం పై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ నటుడు పోసాని.నీకు తెలివుండే మాట్లాడుతున్నవా? చదువుకున్నావా అసలు.నీవు ముఖ్యమంత్రి అయితే ప్రజలను బతకనిస్థావా?, లోకేశ్ బాబు ముఖ్యమంత్రి ఐతే మేము రోహింగ్యాలం అవుతాం. లోకేశ్ బాబు మనస్తత్వం తెలంగాణ వాళ్లకు ఉంటే మమ్మల్శి పిచ్చికుక్కలను కొట్టేవాళ్లు. నాన్ ఏపీ వాళ్లను నంది జ్యూరీలో ఎందుకు పెట్టుకున్నారు,

అవార్డుల ఎంపికలో లోపాలున్నాయని సరిదిద్దుకోమని చెబితే నాన్ లోకల్ అంటున్నారు. పద్మ అవార్డులపై విమర్శలున్నాయి. ఎత్తివేశారా? నాకు నంది అవార్డు రావడం సిగ్గుగా ఉంది.నేను కమ్మ వాడిని కాబట్టి అవార్డ్ ఇచ్చారు అని అనుకుంటారు.నేను విజయవాడ వెళ్తే తరిమేస్తారేమో.?

నాకు టెంపర్ సినిమాకు వచ్చిన అవార్డ్ ను తిరస్కరిస్తున్నా.ఇలాంటి అవార్డ్ నాకు అక్కర్లేదు.నంది అవార్డులకే మమ్మల్ని నాన్ లోకల్ చేశారు..నందులు రద్దు చేయడానికి మీ అబ్బా సొమ్మా? విమర్మించడానికి ఆధార్ , ఓటరు కార్డు కావాలా?రాష్ట్రం విడిపోకముందే పైసల సంచులతో ఆంధ్రకు పారిపోయి అక్కడ దోచుకుంటున్నది మీరు కాదా?” అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దాంతో ఈ గొడవ మరింత దూరం వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here