2 మిలియన్ టార్గెట్…ఇప్పటికి వచ్చింది తెలిస్తే షాక్!

0
577

మాస్ మూవీస్ కి ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు అన్న విషయం తెలిసిందే, కానీ మినిమమ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం అయితే ఉంటుంది, ఇప్పటి వరకు ప్రతీ పెద్ద సినిమా విషయం లో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి, కానీ ఎందుకని వరుసగా రెండు సార్లు ఓవర్సీస్ లో దుమ్ము లేపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ మాత్రం ఓవర్సీస్ లో భారీ నిరాశనే మిగిలించింది.

రంగస్థలం తో అక్కడ రికార్డులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు రామ్ చరణ్. అలాంటి హిట్ తర్వాత వచ్చిన సినిమా కి మినిమం హైప్ ఉండాలి కానీ బోయపాటి పేరు కున్న బ్రాండ్ వాల్యూ వలన ఈ సినిమా కి అక్కడ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

సినిమా Premieres -$181,118, Day1-$29,265 Total Gross-$210,383[₹1.48 Cr]..ని మాత్రమె అక్కడ సాధించింది, సినిమా భారీ లోకేషన్స్ లో రిలీజ్ అవ్వడం తో అమ్మిన రేటు 8 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ కి 2 మిలియన్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఇవాల్టి నుండి ఊహించని జోరు అక్కడ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here