కర్ణాటకలో స్పైడర్ “ట్రేడ్ Vs నిర్మాతల” కలెక్షన్స్

0
1488

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆట నుండే తీవ్ర విముఖతని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమ హీరో ని ఓ టాప్ డైరెక్టర్ ఎలా చూపిస్ తాడో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ ను మిగిలిస్తూ ఎలాంటి హీరోయిజం లేని కథ తో మురగదాస్ చేసిన స్పైడర్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది.

కాగా ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో రచ్చ మాములుగా జరగడం లేదు అని చెప్పొచ్చు. ట్రేడ్ పండితులు చెప్పే లెక్క అలాగే నిర్మాతలు చెప్పే లెక్కల మధ్య తేడా భారీగా ఉండటం తో ఏది నిజమో తెలుసుకోవడం కష్టం అవుతుందని సామన్య ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

సినిమా కర్ణాటకలో ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా తెలుగు మరియు తమిళ్ కలిపి 6.5 కోట్ల షేర్ ని అందుకోగా నిర్మాతలు ఏకంగా 11 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు చెబుతున్నారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. 11 కోట్లు అంటే ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ కిందే లెక్క అవ్వడం తో జైలవకుశ థియేటర్స్ అక్కడ స్పైడర్ కి ఈక్వల్ గా రెండో వారంలో ఉండగా ఈ రేంజ్ వసూళ్లు ఎలా అని విమర్శకులు విమర్శిస్తున్నారు. మరి ఏం జరగనుందో కొన్ని రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here